Saturday, April 20, 2024

డొల్ల మాటలు తప్ప వ్యాక్సిన్లు ఏవి?: కేంద్రాన్ని నిలదీసిన రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi urges PM Modi to end shortage of Vaccines

న్యూఢిల్లీ: రాష్ట్రాలలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ అగ్రనేత, మయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. డొల్ల మాటలు తప్ప దేశంలో వ్యాక్సిన్లు లేవంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీతోసహా అనేక నగరాలలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడినప్పటికీ కేంద్రం మాత్రం దీన్ని ఖండిస్తున్నట్లు వెలువడిన ఒక వార్తా కథనాన్ని రాహుల్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. వ్యాక్సిన్లు ఎక్కడ అనే హ్యాష్‌ట్యాగ్‌తో బూటకపు మాటలే తప్ప వ్యాక్సిన్లు లేవు అంటూ రాహుల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉండగా, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం సైతం వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందచేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాన్ని బూటకపు వాగ్దానంగా ఆయన అభివర్ణించారు.

Rahul Gandhi slams Centre over Covid Vaccines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News