Thursday, April 25, 2024

ఇంధనం ధరల సెగలకు కేంద్రంపై రాహుల్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi slams govt over fuel price hike

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు పె విపరీతంగా పెరిగిపోడానికి కేంద్రం పన్నుదోపిడీయే కారణమని కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు మళ్లీ 35 పైసల వంతున ధరలు పెరిగిన తరువాత రాహుల్ పై విధంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఏవో పాత కథలు చెప్పి పన్నులను ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. మొదట ప్రజలు దీనికి బాధపడడం అలవాటు చేసుకున్నా తరువాత చివరకు ఈ అస్తవ్యస్థ ప్రభుత్వానికి అంతం పలుకుతారని వాస్తవానికి అదే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈమేరకు పన్నుదోపిడీ అన్న టాగ్‌తో హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు వీడియో ద్వారా వాయిస్ ఓవర్ విడుదల చేశారు. గత ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ రూ. 23 లక్షల కోట్లను ఆర్జించిందని ఈ డబ్బంతా ఎక్కడకు వెళ్లిందని ప్రజలంతా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News