Home జాతీయ వార్తలు రాహుల్‌వి చిన్న పిల్లాడి మాటలు : వెంకయ్యనాయుడు

రాహుల్‌వి చిన్న పిల్లాడి మాటలు : వెంకయ్యనాయుడు

Venkaiah-Naiduన్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయంపై తనను మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వెంకయ్య రాహుల్‌వి చిన్న పిల్లాడి మాటలని, అపరిపక్వతతో కూడుకున్నవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తుందని, తమ అసలు రంగు బయటపడుతుందనే భయంతోనే వారు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ సెలవుల్లోనే పార్లమెంటుకు వస్తున్నారని, ఆయన రెగ్యులర్‌గా సభకు రారని అన్నారు. ప్రధాని మోడీని పార్లమెంట్‌లో మాట్లాడనివ్వకపోవడంతోనే ఆయన జనసభల్లో మాట్లాడుతున్నారని వెంకయ్యనాయుడు అన్నారు.