Friday, March 29, 2024

బాధిత గొంతు నులిమేస్తే ప్రతిఘటనలే

- Advertisement -
- Advertisement -

Rahul & Priyanka Gandhi meet Hathras Dalit girl’s family

 

హత్రాస్‌లో రాహుల్ ప్రియాంకల హెచ్చరిక, యువతి కుటుంబానికి పరామర్శ

లక్నో /హత్రాస్ : దళిత మహిళ కుటుంబానికి పూర్తి న్యాయం కోసం తమ పోరు సాగిస్తామని రాహుల్, ప్రియాంకలు శనివారం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని పలకరించేందుకు వారికి ధైర్యం చెప్పేందుకు గ్రామానికి బయలుదేరిన క్రమంలో తొలి ప్రయత్నంలో భంగపడ్డ సోదరి సోదరులు శనివారం అధికారుల అనుమతితో గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా నివాసం వెలుపల ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఇంటి వెలుపల భారీ భద్రతా ఏర్పాట్లు నడుమ రాహుల్, ప్రియాంకలు దళిత మహిళ కుటుంబ సభ్యులతో దాదాపు ముప్పావు గంట మాట్లాడారు. తరువాత వెలుపలికి వచ్చిన ఇద్దరూ ఇంటికి దూరంగా విలేకరులతో మాట్లాడారు. కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం జరగాల్సి ఉంది. కేవలం హామీలు ఇతరత్రా భరోసాలతో న్యాయం ఏదీ జరగదని, కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకూ తాము పోరు చేస్తూనే ఉంటామని రాహుల్ తెలిపారు. కుటుంబ సభ్యుల బాధాతప్త గొంతుకను ఏ శక్తి అణచివేయజాలదని, ముందుగా వారి గొంతుకలోని నిజాలు వెలుగులోకి వచ్చేలా చూడాల్సి ఉందన్నారు.

ఎవరూ ఈ కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని వక్రీకరించడానికి వీల్లేదని, పూర్తిస్థాయి న్యాయంతోనే దళిత యువతికి నిజమైన నివాళి దక్కుతుందని సోదరితో కలిసి రాహుల్ డిమాండ్ చేశారు. గ్రామానికి వెళ్లడానికి రాహుల్ ప్రియాంకలకు అనుమతి నిరాకరణపై పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అంతకు ముందు నిరసన ప్రదర్శనలకు దిగారు. ఢిల్లీ నోయిడా రోడ్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. తమ నేతలు ఊరికి వెళ్లేందుకు వీలు కల్పించాల్సిందే అంటూ బారికేడ్లు దాటుకుని వారు ముందుకు సాగడంతో పోలీసు బృందాలకు వారికి మధ్య తోపులాటలు జరిగాయి. అయితే ఇదే సమయంలో రాహుల్, ప్రియాంకలకే కాకుండా ఇతర నేతలకు కూడా గ్రామ సందర్శనకు ఉన్నతాధికారులు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. దీనితో కారులో రాహుల్ ప్రియాంకలు బాధితురాలి నివాసానికి వెళ్లారు. గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను చూసేందుకు ఈ గ్రామస్థులు భారీ ఎత్తున చేరారు. పలువురు ఇళ్లపైకి చేరుకున్నారు. కొందరు చెట్లెక్కారు. రాహుల్ ప్రియాంక వెంబడి యుపి కాంగ్రెస్ నేతలు ప్రదీప్ మాథుర్ ఇతరులు కూడా ఉన్నారు. గాంధీలతో పాటు సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌదరీ, ముకుల్ వాస్నిక్ ఇతరులు కూడా గ్రామానికి వచ్చారని, బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారనని మాథుర్ తెలిపారు.

ఘటనపై సిబిఐ దర్యాప్తు

హుటాహుటిన యోగి సర్కారు నిర్ణయం

లక్నో : హత్రాస్ ఘటనపై సిబిఐ దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలు వెలువరించారు. ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష తరువాత సిఎం శనివారం రాత్రి హుటాహుటిన కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలతో ప్రకటన వెలువరించారు. ఓ వైపు ఘటనపై సిట్ ఏర్పాటు చేసి. 48 గంటలలో దర్యాప్తు నివేదికను అందించాలని ఆదేశాలు వెలువరించిన కొద్ది సేపటికే సిఎం సిబిఐకి కేసు దర్యాప్తును అప్పగించాలని ఆదేశించడం కీలక పరిణామంగా మారింది. సామూహిక అత్యాచారం ఘటనలో దెబ్బతిని అసువులు బాసిన దళిత మహిళకు న్యాయం కోసం వెల్లువెత్తుతున్న నిరసనల నడుమ సిఎం స్పందించారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తును కోరుతున్నట్లు సిఎం తెలియచేసిన తరువాత కేంద్రీయ దర్యాప్తు సంస్థ ఇందుకు వెంటనే అనుమతిని తెలిపింది.

సిఎం సిబిఐ దర్యాప్తునకు లేఖ రాసిన విషయాన్ని యుపిలో సిఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సంబంధిత అధికారులతో శనివారం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తరువాత సిబిఐ దర్యాప్తు విషయాన్ని సిఎం తెలిపారు. హత్రాస్ ఘటనకు సంబంధించి సమగ్ర రీతిలో దర్యాప్తు జరిపించాల్సి ఉంది. అత్యాచారం, ఈ దశలో ఆమెపై దాడి, గాయాలు , తరువాత మరణం, అర్థరాత్రి భౌతికకాయం అంత్యక్రియలు కుటుంబ సభ్యులకు తెలియచేయకుండా వంటి పలు విషయాలపై సమగ్ర దర్యాప్తునకు సిఎం ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామాన్ని సందర్శించి బాధితులను కలిసివచ్చిన అదనపు సిఎస్, డిజిపిలతో పరిస్థితిని సిఎం సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News