Home జాతీయ వార్తలు బిజెపి ఆందోళనతో ఏకీభవిస్తున్నా..

బిజెపి ఆందోళనతో ఏకీభవిస్తున్నా..

 

Smriti Irani Old Picture

గ్యాస్ ధర పెంపుపై ఇరానీ ఫోటోతో రాహుల్ ఆసక్తికర ట్వీట్

న్యూఢిల్లీ: ఎల్‌పిజి సిలిండర్ ధర పెంచినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ బిజెపిపై గురువారం మండిపడ్డారు. యూపిఎ హయాంలో వంట గ్యాస్ ధర పెరిగినందుకు కాషాయ దళం నాయకులు నిరసన తెలిపిన ఫోటోను రాహుల్ ట్వీట్ చేశారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ఇంధనం ధరలు తారస్థాయికి చేరడంతో ఎల్‌పిజి రేటు బుధవారంనాడు సిలిండర్ మీద ఒకేసారి రూ. 144.5 పెరిగింది. ఆనాడు గ్యాస్ ధర పెరిగినప్పుడు బిజెపి ఆందోళన చేస్తున్న ఫోటోను ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ ‘ఎల్‌పిజి సిలిండర్ రేటు 150 రూపాయలు పెరిగినందుకు బిజెపి సభ్యుల ఆందోళనతో నేను ఏకీభవిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ ధరలు పెరిగినందుకు బిజెపి నాయకులు ఆందోళన చేసిన ఆ ఫోటోలో స్మృతి ఇరానీ కూడా ఉన్నారు. గాంధీ తన ట్వీట్‌కు ‘రోల్‌బ్యాక్‌హైక్’ అనే హ్యాష్‌టాగ్ వాడారు. ఎల్‌పిజి సిలిండర్‌పై రూ 144 పెంచడంతో సామాన్యుడికి బడ్జెట్ ‘విద్యుదాఘాతం’గా మారిందని, పెంచిన గ్యాస్ ధరను వెంటనే వెనక్కు తీసుకోవాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.

Rahul Tweets Smriti Irani Old Picture on Gas Price hike