Saturday, April 20, 2024

యాదాద్రిగా రాయగిరి రైల్వేస్టేషన్

- Advertisement -
- Advertisement -

Raigir railway station renamed as Yadadri Railway Station

హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్‌ను ఇకపై యాదాద్రిగా పిలవనున్నారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం రాయగిరి రైల్వేస్టేషన్ పేరును యాదాద్రిగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయితే దేశ నలుమూలల నుంచి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్ పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేయగా, ఈనెల 18వ తేదీన దక్షిణ మధ్య రైల్వే అధికారులు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. యాదగిరిగుట్టకు రాయగిరి రైల్వే స్టేషన్ మూడుకిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్ ఖాజీపేట సెక్షన్‌లో భువనగిరి వంగపల్లి మధ్యన రాయగిరి రైల్వేస్టేషన్ ఉంది.

Raigir railway station renamed as Yadadri Railway Station

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News