Wednesday, April 24, 2024

ప్రయాణికులకు రైల్వే సంక్రాంతి కానుక

- Advertisement -
- Advertisement -

Railway

 

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే యాజమాన్యం కానుక ప్రకటించింది. సూదూర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నాలుగు డబుల్ డెక్కర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత అత్యంత రద్దీ మార్గాలైన విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్‌ల మధ్య డబుల్ డెక్కర్ రైళ్లు అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణికుల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూదూర ప్రాంతాల ప్రయాణికుల సంతోషదాకమైన ప్రయాణ అనుభూతలను కల్పించేందుకు డబుల్ డెక్కర్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ నెల 12వ తేదీ నుండి19వ తేదీల మధ్య విశాఖపట్నం,విజయవాడ, సికింద్రాబాద్‌ల మధ్య నాలుగు డబుల్ డెక్కర్ రైళ్లు నడపాలని నిర్ణయించారు. విశాఖపట్నంసికింద్రాబాద్‌ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఉదయం 5:45గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 13వ తేదీ నుండి 20వ తేదీ మధ్య సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య అందుబాటులో ఉంటాయి. వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ రైల్వే స్టేషన్ మీదుగా నడుస్తాయి.

Railway announce gift to Passengers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News