Thursday, April 25, 2024

పెరిగిన రైల్వే చార్జీలు

- Advertisement -
- Advertisement -

 Railway Charges

 

కి.మీ వద్ద 1 నుంచి 4 పైసలు
ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్‌పై ఒక పైస, మెయిల్ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్‌కు రెండు పైసలు, ఎసి చైర్ కార్, ఎసి-2,3 ఫస్ట్‌క్లాస్‌కు నాలుగు పైసలు
మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన చార్జీలు

న్యూఢిల్లీ : రైల్వే చార్జీలు స్వల్పంగా పెరిగాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌కు కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెయిల్ సెకండ్‌క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్‌క్లాస్‌లకు కిలోమీటర్‌కు రెండు పైసల చొప్పున పెంచారు. ఎసి చైర్‌కార్, ఎసి త్రీ, టూటైర్, ఎసి ఫస్ట్‌క్లాస్‌కు కిలోమీటర్‌కు నాలుగు పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శతాబ్ది, రాజధాని, దురంతో లాంటి ప్రీమియం రైళ్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఆ ప్రకారం చూస్తే ఢిల్లీ కోల్‌కతా రాజధాని ఎక్స్‌ప్రెస్ 1,447 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కిలోమీటర్‌కు నాలుగు పైసల చొపున దాని టికెట్ ధర రూ.58 పెరుగుతుంది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రినుంచే అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సబర్బన్ రైళ్లలో మాత్రం చార్జీల పెంపు లేదని రౌల్వే శాఖ స్పష్టం చేసింది.

అంతేకాకుండా రిజర్వేషన్ చార్జీ, సూపర్ ఫాస్ట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని, అలాగే ఇప్పటికే బుక్ చేసిన టికెట్ల చార్జీలకు ఈ పెంపు వర్తించదని కూడా తెలిపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో చివరి సారిగా రైల్వే చార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల చార్జీలు 14.2 శాతం, సరకు రవాణా చార్జీలు 6.5 శాతం పెంచారు. అయితే ఆ తర్వాత రైల్వే ఫ్లెక్సీ ఫేర్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లాంటి కొన్ని రైళ్లలో చార్జీలు గణనీయంగా పెరిగాయి. అలాగే సువిధ ఎక్స్‌ప్రెస్‌లాంటి వాటిలో డైనమిక్ ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది. కాగా స్వల్పంగా పెంచిన చార్జీల ద్వారా వచ్చే రాబడిని రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణ కోసం ఉపయోగించడం జరుగుతుందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా ఈ పెంపు ప్రభావం క్యాటరింగ్ సర్వీస్‌పై ఉండదని అధికారులు తెలిపారు.

 

Railway Department Increased Railway Charges
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News