Thursday, April 25, 2024

పిఎం కేర్స్‌ నిధికి రైల్వే శాఖ రూ.151 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

piyush goyal

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు రైల్వే మంత్రిత్వశాఖ రూ.151 కోట్లు పిఎంకేర్స్‌కు విరాళంగా అందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ఆదివారం ప్రకటించారు. ప్రధాని పిలుపుపై తాను, సురేష్ అంగాడి ఒక నెల వేతనం 13 లక్షల రైల్వే , పిఎస్‌యు ఉద్యోగులు ఒక రోజు వేతనం, ఇదంతా కలిపి రూ. 151 కోట్లు అవుతుందని, గోయెల్ ట్వీట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్స్‌సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమెర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ (పిఎం కేర్స్) పేరున కరోనా నియంత్రణకు కావలసిన నిధిని కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్‌కు నరేంద్రమోడీ ఛైర్మన్. రక్షణ మంత్రి, హోమ్ మంత్రి, ఆర్థిక మంత్రి సభ్యులుగా ఉంటారు.

Railway donation to PM Cares Fund
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News