Home తాజా వార్తలు రైల్వే గ్యాంగ్‌మెన్ ఆత్మహత్మ

రైల్వే గ్యాంగ్‌మెన్ ఆత్మహత్మ

Suicideమనతెలంగాణ/కొత్తగూడెం క్రైం : రైల్వే గ్యాంగ్‌మెన్ గా పనిచేస్తొన్న చిత్తారి కృష్ణారావు (47) గురువారం మద్యాహ్నం గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిఆర్‌పి పోలీసుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లిమండలంలోని తెలగరామారానికి చెందిన చిత్తారి కృష్ణారావు రైల్వే లో గ్యాంగ్‌మన్ గా ,సినీయర్‌సెక్షన్ ఇంజనీర్ వద్ద పనిచేస్తున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలోని రైటర్‌ బస్తిలోని గొల్లగూడెం లోని తన క్వార్టరలో భార్య, పిల్లలతో నివిసిస్తున్నాడు. అతను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్నాడు. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. జీవితంపై విరక్తితో రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిఆర్‌పి హెడ్‌కానిస్టేబుల్ ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణారావుకు భార్య లత, కుమారుడు గౌతం, కుమార్తె లావణ్య ఉన్నారు.

Railway Gang Man Commits Suicide