Home తాజా వార్తలు రైల్వే గ్యాంగ్‌మెన్‌ అనుమానాస్పద మృతి !

రైల్వే గ్యాంగ్‌మెన్‌ అనుమానాస్పద మృతి !

Suspicious Deathహైదరాబాద్‌: గ్యాంగ్‌మెన్‌ అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన నగరంలోని బోరబండ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ మృతదేహాన్ని బోరబండ సమీపంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సంఘటనస్థలాన్ని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Railway Gangmen Suspicious Death in Hyderabad