Tuesday, April 16, 2024

గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టిన రైల్వేశాఖ

- Advertisement -
- Advertisement -

Railways introduced 813 new trains in last five years

ఆర్‌టిఐ సమాధానంలో వెల్లడి

న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ పెట్టినట్టు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వేబోర్టు వివరాలు తెలియచేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016 లో సాధారణ బడ్జెట్‌లో రైవ్వే బడ్జెట్‌ను విలీనం చేసిన తరువాత బడ్జెట్ సమయంలో వన్‌టైమ్ ప్రకటన విడుదల చేసే విధానానికి స్వస్తి పలకడమైందని పేర్కొంది.

కొవిడ్ మహమ్మారి కారణంగా 2020 21 లో కొత్తగా ఏ ఒక్క రైలును ప్రవేశ పెట్టడం జరగలేదని, 2016 17 లో 223, 2017 18 లో 170, 2018 19 లో 266, 2019 20 లో 144 రైళ్లను ప్రవేశ పెట్టడమైందని వివరించింది. 2015 16 లో అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను సమర్పించినప్పుడు కొత్తగా ఏ ఒక్క రైలును కానీ, విస్తరణ కానీ ప్రకటించలేదని, అంతకు ముందటి రైల్వే మంత్రి డివి సదానంద గౌడ 2014 15 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడు ఐదు కొత్త జనసాధారణ్ రైళ్లను ప్రకటించారని, ఐదు ప్రీమియం, మరో ఐదు ఎసి రైళ్లు, 27 కొత్త ఎక్స్‌ప్రెస్‌రైళ్లను ప్రకటించారని బోర్డు పేర్కొంది.

కొత్తప్యాసింజర్ రైళ్లు ఎనిమిదిని, ఐదు డెమూ సర్వీస్‌లను, రెండు మొమూ సర్వీసులను ప్రకటించినట్టు వివరించింది. ఇదివరకు సాధారణంగా రైల్వేబడ్జెట్‌లో కొత్త రైళ్లు ప్రకటిస్తారని ఏవో ఆశలతో నిరీక్షించేవారని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే సంబంధిత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్‌లో రైళ్లు కొత్తగా ప్రకటించేవారని, ఇదంతా రాజకీయంగా జరిగేదని రైల్వే అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 2023 ఆగస్టు నాటికి 75 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రవేశపెడుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News