Thursday, April 25, 2024

రైల్వే మరకల నివారణకు రూ. 1200 కోట్లు

- Advertisement -
- Advertisement -

Railways spends around Rs 1200 cr each year to clean

న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలకు ప్రజల ఉమ్ములు, పాన్‌మరకల శుభ్రానికి ఏటా రూ 1200 కోట్ల ఖర్చు అవుతోంది. రైల్వే ఆవరణలలో, ప్లాట్‌ఫారాలలో, బోగీలలో పాన్ తంబాకులు నమిలి ఉమ్మివేయడాలు, ఇతరత్రా అమలినాలకు దిగరాదని ఎంత చెప్పినా , చివరికి కొవిడ్ 19 తీవ్రస్థాదశలో కఠిన నిబంధనలు విధించినా ఫలితం లేకుండా పోయింది. ఇది రైల్వేలకు వీడని వైరస్ సమస్య కన్నా తీవ్ర తెగులు అయింది. పరిసరాల శుభ్రతకు రైల్వేలు తప్పనిసరిగా తీకుంటున్న చర్యలకు దాదాపుగా అయ్యే ఖర్చు రూ 1200 కోట్లు. అంతేకాకుండా ఓ పట్టానా వదలని ఎర్రటి ఇతరత్రా మరకల శుభ్రానికి విపరీత స్థాయిలో నీళ్లు అవసరం అవుతున్నాయి. పారిశుద్థానికి వెచ్చించే కేటాయింపులు ఏటేటా పెరుగుతున్నాయి. రైల్వే స్టేషన్లు, ఆవరణలలో పరిశుభ్రతకు వెండింగ్ మిషన్లు లేదా కియోస్కోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రూ 5 లేదా రూ 10కి దొరికే చిన్నపాటి ఉమ్మి ప్యాకెట్లతో కూడిన కియోస్కోలను 42 స్టేషన్లలో అమర్చారు. ఈ చిన్నపాటి ప్యాకెట్లలో ఉండే విత్తనాలు వీటిని చెత్తబుట్టలలో వదిలిన తరువాతి క్రమంలో మొక్కలుగా ఎదుగుతాయి. ఓ విధంగా ఈ ఏర్పాట్లతో పారిశుద్ధ చర్యలు చేపట్టడం మరో వైపు హరిత పరిరక్షణకు వీలైన సృజనాత్మక ఆవిష్కరణకు మార్గం ఏర్పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News