Home జాతీయ వార్తలు రూ.111 ఖర్చు చేస్తే రూ.100 ఆదాయం…

రూ.111 ఖర్చు చేస్తే రూ.100 ఆదాయం…

Railways spends Rs 111 to earn Rs 100

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రైల్వే శాఖ ప్రజా రవాణాపై రూ.111 ఖర్చు చేస్తే, రూ. 100 ఆదాయం వస్తుందని అధికారులు విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. రైల్వే లైన్ల ఆధునీకరణ, కోచ్‌ల అభివృద్ధి, రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేయడం వల్ల ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేశిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఖర్చు పెట్టిన దానికి 90 శాతం ఆదాయం వస్తే, 2017-18 సంవత్సరంలో 96శాతం, 2018-2019 సంవత్సరంలో 92.8 శాతం ఆదాయం పొందినట్టు వారు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.48 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నట్టు సంబంధిత అధికారులు చెప్పారు.