Wednesday, April 24, 2024

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -
Railways to introduce hostesses on premium trains
ఎయిర్‌హోస్టెస్ తరహాలోనే ప్రీమియం రైళ్లలో ట్రైన్ హోస్టెస్‌ల నియామకం
ముందస్తుగా ప్రీమియం రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి….

హైదరాబాద్: రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల్లో సేవలందించే ఎయిర్‌హోస్టెస్ తరహాలోనే ప్రీమియం రైళ్లలో ట్రైన్ హోస్టెస్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వేశాఖ నడుపుతున్న వందే భారత్, గతిమాన్, తేజస్ వంటి ప్రీమియం రైళ్లలో ముందస్తుగా సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. సుదూర గమ్యాలకు ప్రయాణం చేసే ట్రైన్స్ రాజధాని, డొరెంటో ఎక్స్‌ప్రెస్‌లలో ట్రైన్ హోస్టెస్‌ను ప్రవేశపెట్టే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ట్రైయిన్ హోస్టెస్‌లుగా మహిళలను మాత్రమే కాకుండా పురుషులను కూడా తీసుకోవాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

ట్రైన్ హోస్టెస్‌ల విధి, విధానాలు

ట్రైన్ హోస్టెస్‌లు ప్రయాణికులు రైళ్లు ఎక్కేటప్పుడు వారిని పలకరించడం, ఆహారం అందించడం, ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని నమోదు చేయడం లాంటివి చేయనున్నారురు. వీరి సేవలు కేవలం పగటి పూట మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాత్రి పూట కూడా వారి సేవలను ఉపయోగించుకోవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి తగినట్లుగానే ఛార్జీలను వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించినట్టుగా తెలిసింది.

దేశవ్యాప్తంగా 25కు పైగా ప్రీమియం రైళ్లు

రైల్వే అటెండర్ల డ్రస్ కోడ్‌లో ఎలాంటి మార్పు లేదని, అయితే మహిళలను మాత్రం ఆతిథ్యరంగంలో శిక్షణ పొందిన వారినే ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. భారతీయ రైల్వే సుమారు 25కు పైగా ప్రీమియం రైళ్లను దేశ వ్యాప్తంగా నడుపుతుంది. వాటిలో 12 శతాబ్ది, ఒకటి గతిమాన్, రెండు వందే భారత్, ఒకటి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News