Home ఖమ్మం ఏజెన్సీలో జోరు వాన

ఏజెన్సీలో జోరు వాన

rainజిల్లాలో రుతుపవనాల ప్రభావం
పలు చోట్ల ఎడతెరిపి లేని వర్షం – చిత్తడిగా మారిన రోడ్లు
చెరువులు, కుంటలకు చేరుతున్న కొత్తనీరు
ఖమ్మం: రుతు పవనాల ప్రభావం జిల్లాపై ఉండడంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మధిర ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతంలోని చెరువుల్లోకి నీరు చేరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పూడిక తీతను చేపట్టడంతో ఆయా చెరువులు బాగు పడ్డాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఆలస్యమైనప్పటికీ జిల్లాపై రుతు పవనాల ప్రభావం అధికం కావడంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగావర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవడంతో ఖమ్మం నగరంతో పాటు వివిధ మండల కేంద్రాలు, పట్టణాల్లో రోడ్లు, వీధుల్లో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు డ్రైనేజీ ద్వారా ఎటూ పోకపోవడంతో రోడ్లన్నీ చిత్తడి మారి పాదాచారులకు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే రెండు, మూడు దఫాలు వచ్చిన వర్షానికి చెరువుల్లోకి నీరు చేరడంతో భూగర్భ జలాలు ఒక మోస్తారుగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో పలు చోట్ల రైతన్నలు పెసర, మినుము, పత్తి, మొక్కజొన్న, కంది ఇతర అపరాల పంటలను లక్ష ఎకరాలకు పైగా సాగు చేశారు. వర్షాలు జాప్యం కావడంతో పలు చోట్ల నేటికీ విత్తనాలు విత్తకపోవడం గమనార్హం. ఈ వర్షాలతో పత్తితో పాటు మిర్చి, వరి నారు మళ్లను తయారు చేస్తూ నార్లు పెంచుకునేందుకు రైతన్నలు సిద్ధ్దమయ్యారు. వ్యవసాయ శాఖా ధికారులు రైతులకు సకా లంలో విత్తనాలు, ఎరువులు అందిం చడంలో జాప్యం చేశారని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభు త్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామని జాప్యం చేయ డంతో ఉన్న రుణాలు మాఫీ కాక, బ్యాంకుల ద్వారా కొత్త రుణాల రాక ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చు కుంటున్నారు.