Home తాజా వార్తలు తెలంగాణలో వర్షాలు పడే సూచన

తెలంగాణలో వర్షాలు పడే సూచన

Rain forecast in Telangana State for three daysహైదరాబాద్‌ : వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం విస్తరించి ఉందని వారు పేర్కొన్నారు. ఝార్ఖండ్‌ నుంచి ఉత్తర మహారాష్ట్ర మీదుగా, ఛత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వారు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు తేలిక పాటి మోస్తరు వానలు పడుతాయని అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వారు వెల్లడించారు.  గురువారం ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, నారాయణపేట, మహబాబూబ్‌నగర్‌, కొత్తగూడెంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.