Friday, April 19, 2024

వచ్చే నాలుగైదు రోజులు తెలంగాణకు వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Rain forecast for Telangana for three days

హైదరాబాద్: తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ ఇంటీరియర్ కర్నాట మీదుగా కేరళ తీరం వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం విస్తరించిందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rain forecast to Telangana for next 4 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News