Thursday, April 18, 2024

రెండో రోజు ఆట వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

Rain hinders India-South Africa Test

భారత్‌-సౌతాఫ్రికా టెస్టుకు వర్షం అడ్డంకి

సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా సోమవారం రెండో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే పూర్తిగా రద్దయ్యింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా తయారైంది. దీంతో ఆటను రద్దు చేయడం మినహా అంపైర్లకు మరో మార్గం లేకుండా పోయింది. కిందటి రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం కూడా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఇక పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికితీ ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత వర్షం తగ్గితే కాస్త ఆలస్యంగానైనా ఆటను ప్రారంభించాలని అంపైర్లు భావించారు. కానీ వర్షం ఎంతకూ తగ్గక పోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక ఆదివారం ప్రారంభమైన బాక్సిండ్ డే టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్.రాహుల్ భారత్‌కు శుభారంభం అందించారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ 123 బంతుల్లో 9 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. కాగా, సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా మరోసారి నిరాశ పరిచాడు. అతను ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (35) కాస్త మెరుగ్గానే ఆడాడు. ఓపెనర్ రాహుల్ కదందొక్కాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన రాహుల్ 248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్సర్ 122 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అజింక్య రహానె 40 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News