Tuesday, April 23, 2024

ముసురు పట్టిన నగరం

- Advertisement -
- Advertisement -

Rain in hyderabad today live

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
వాతావరణశాఖ అధికారులు

హైదరాబాద్: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా నగరంలో ముసురు పట్టింది. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు పడుతుండటంతో నగర వాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సోమవారం అర్దరాత్రి నుంచి మంగళవారం ఉదయం ఒరకు ఒక మోసర్తు వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు చేరడంతో ఆయా ప్రాంత వాసులు పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ముసురుపట్టడంతో కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడిన వర్షాలు పడగ మరో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం పడటంతో కార్యాలయాల నుంచి ఇళ్ళకు వెళ్ళే ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు.

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. రోడ్డు మీద మోకాళ్ళ లోతు నీర చేరడంతో పాదాచారులు మాత్రమే కాకుండా ద్విచక్రవాహనాల మీద వెళ్ళేవారు అనేక ఇబ్బందులు పడ్డారు. సాధారణ రోజుల్లో గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల స్పీడ్‌తో వెళ్ళే వాహనాలు స్పీడ్ 5 నుంచి 10 కిలోమీటర్లకు తగ్గింది. మరో రెండు రోజులు పాటు నగరంలో చెదుమొదురు వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News