Home తాజా వార్తలు వచ్చే మూడు రోజుల్లో వర్షాలు

వచ్చే మూడు రోజుల్లో వర్షాలు

Rain

రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాగల మూడురోజుల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా నైరుతి దిశతో పాటు పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తేలికపాటి నుంచి మంగళవారం రాత్రి, బుధ, గురువారాల్లో ఒక మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్ర మరియు యానాంలో మంగళవారం రాత్రి, బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.మంగళవారం రాత్రి, బుధ, గురువారాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

Rain likely for next three days