Home జిల్లాలు పట్నంలో వర్షాలకు విజృంభిస్తున్న వ్యాధులు

పట్నంలో వర్షాలకు విజృంభిస్తున్న వ్యాధులు

dustఅప్రమత్తంగా ఉండాలని
అధికారుల ఆదేశాలు
మన తెలంగాణ/ ఇబ్రహీపట్నం టౌన్: గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం నగర పంచాయితీ , మండలంలోని వివిధ గ్రామాలలో వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు ఎవరు స్పందించడం లేదు. డెంగ్యూ, మలేరియా చికెన్‌గున్య వంటి విషజ్వరాలతో అనారోగ్యాలకు గురైతున్నారు. వైద్యం కోసం నిత్యం దవాఖానాల బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిపించడంలో అధికారులు ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో చిన్న పిల్లలు, ముసలి వారు అనే తేడా లేకుండా అందురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గ్రామాలలో గత వారం రోజులుగా కుండపోతగా వర్షం వలన గుంత లలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, మురుగు కాలు వలను పరిశుభ్రంగా ఉంచకపోవడం వలన ఈగలు, దోమలు, క్రిమికీటాకాలు ఇళ్ళలోకి చేరడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.ఇప్పటివరకు అధికారులు దోమల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆసుపత్రులు రోగులతో నిండి పోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు కావాలిసిన వైద్యాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.