Friday, March 29, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rains in many parts of Hyderabad

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, చందానగర్, కోఠి తదితర ప్రాంతాల్లో చినుకులు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు వెల్లడించారు. అటు రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల 5న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహారాష్ట్ర, ఎపిలో ఇప్పటికే పూర్తిగా రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదగా వెళ్లే అవకాశముందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీయనున్నాయని అధికారులు తెలిపారు. అటు ఎపిలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Rains in many parts of Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News