Wednesday, April 24, 2024

బుధవారం నుంచి తెలంగాణలో వర్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మార్చిలో తీవ్రస్థాయి ఎండల నడుమ తెలంగాణలో వచ్చే మూడు నాలుగురోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ పరిశోధక విభాగం (ఐఎండి) సోమవారం తెలిపింది. బుధవారం నుంచి ఈ వానలు కురుస్తాయని, ఉత్తరతెలంగాణలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరేముందు కురిసే తొలకరి జల్లులుగా వీటిని పేర్కొంటున్నారు. గురువారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, కొంత మేర రాళ్లు కూడా పడే అవకాశం ఉండటంతో దీని వల్ల మామిడి కాతకు దెబ్బ ఉంటుంది.

ఈ నాలుగయిదురోజుల వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని 12 జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులు గాలులు పరిణామం ఏర్పడుతుంది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వచ్చే రెండు మూడు రోజులలో తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకూ ఉండవచ్చునని అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News