Thursday, March 28, 2024

నవంబర్ వరకు వానలు

- Advertisement -
- Advertisement -

Rains in Telangana till November

హైదరాబాద్: రాష్ట్రానికి వాన గుబులు పట్టుకుంది. ఈసారి వర్షాలు నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా వానాకాలం ముగిసినా వానలు దంచి కొడుతున్నాయి. నవంబర్ వరకు వర్షాలు కొనసాగుతూనే చలి ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నవంబర్ తొలి వారం నుంచే తీవ్రమైన చలిగాలులు విజృంభించే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వానాకాలం అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడటంతో వర్షాలు అంచనాకు మించి కురిశాయి.

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బంగాళాఖాతంలో 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఒక వాన నుంచి తేరుకునేలోపే మళ్లీ వానలు కురిశాయి. అక్టోబర్ నెలలో సైతం అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఒక దాని వెనుక మరో అల్పపీడనం ఏర్పడుతోంది. ఈ అల్పపీడనంతో నవంబర్ నెల వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్న అధికారులు, నవంబర్‌లోనే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మంచు ఎక్కువగా కురుస్తుందని, చలి విజృంభిస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Rains in Telangana till November

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News