Home తాజా వార్తలు వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలి…

వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలి…

rainy-seasonఅత్యవసర పరిస్థితుల్లో టోల్ ప్రీ నెంబర్లకు పోన్ చేయాలి, విద్యుత్ అధికారులు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసి పరిధిలో అంతరాయం లేకుండా వి ద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్‌ను ఎ టువంటి అంతరాయాలు లేకుండా సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చె ప్పారు. అన్ని సర్కిళ్ళలో ఇప్పటికే విద్యుత్ లైన్లను,డీటీఆర్(డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రా న్స్‌ఫార్మర్స్) వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో ఏ మాత్రం అంతరాయం ఏర్పడినా విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు చెప్పారు..జీహెచ్‌ఎంసి పరిధిలోని 9 సర్కిల్స్ పరిధిలోనూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

పలు కారణాలతో అంతరాయాలు ఏర్పడినా యుద్దప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్దరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కరెంట్ సెంట్రల్ బ్రేక్‌డౌన్ వింగ్ సిబ్బందిని ఆదేశించామన్నారు. అందుకు అవసరమైన పరికాలను ముందుస్తుగా అందుబాటులో పెట్టుకున్నామన్నారు. ప్రతి కాలనీల్లోనూ కరెంట్ స్థంబాల ను ఇప్పటికే పరిశీలించామని తెలిపారు. అంతే కాకుండా ఇందుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థను పటిష్టపరిచినట్లు చెప్పారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు విద్యుత్ పట్ల ఎంతో జాగ్రత్తగా వుండాలని, ఇందుకు కోసం కొన్నిజాగ్రత్తలను ప్రజల భద్రత కోసం తీసుకోవాలంటున్నారు.

* ఓవర్‌హెడ్ పవర్ లైన్స్ కింద నడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఐరన్ కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లను,ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉండాలన్నారు.
* అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ వైర్లు తెగిపడిన వెంటనే ప్రజలు 1912,100,2111111 వంటి టోల్ ఫ్రీ నెంబర్లను

సంప్రదించాలి.

* కరెంట్ షాక్ తగిలితే వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేయాలి.
* ఇంట్లో వైరింగ్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, వైరింగ్ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు దాటితో వాటి స్థానంలో కొత్తగా ఏర్పాటటు చేసుకోవడం కాని, ఇందుకు సంబంధించిన నిపుణులతో వైరింగ్‌ను పునరుద్దరించుకోవాలి.
* గృహాల్లో వైర్లుర బాగు చేసేటప్పుడు గుర్తింపు పొందిన విద్యుత్ వైర్లును, పరికాలను మాత్రమే వినియోగించాలి.
* విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో చెత్తను పారవేయ కూడదు.

Rainy Season Problems And Precautions