Sunday, March 26, 2023

పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

- Advertisement -

farmer

మనతెలంగాణ/ కమ్మర్‌పల్లి: పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కమ్మర్‌పల్లి మండల రైతులు జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. కమ్మర్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాల రైతులు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీనికి ఆర్మూర్ ఎసిపి శివకుమార్ 60మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. దీనికి శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాజరాంయాదవ్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత వి.ప్రభాకర్ హాజరై రాస్తారోకోకు సంఘీభావం తెలిపారు. రైతులు మాట్లాడుతూ వ్యవసాయ ఖర్చులు మూడింత లు పెరిగినా పంటలకు మాత్రం గిట్టుబాటు ధర రావడంలేదని వాపోయారు. పంటల పెట్టుబడి ఖర్చు లు, కూలీ ధరలు పెరిగాయని, పంటలకు మాత్రం ధరలు లేకుండాపోయాయన్నారు. 20072010 సంవత్సరంలో రూ. 12వేలు పలికిన పసుపు ధర ప్రస్తుతం రూ. 5వేలు కూడా పలకడంలేదన్నారు. ఈ పరిస్థితికి కారణం సిండికేట్ వ్యవస్థనే అంటూదుయ్యబట్టారు. ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ. 4500 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొను గోలు చేయాలని డిమాండ్ చేశారు. గంటసేపుసాగిన రాస్తారోకో జాతీ య రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్మూర్ ఎసిపి శివకుమార్, ఆర్మూర్ రూరల్ సిఐ రమణరెడ్డి, భీంగల్ సిఐ సైదయ్య, కమ్మర్‌పల్లి,భీంగల్,మోర్తాడ్, ఏర్గట్ల, బాల్కొండ ఎస్సైలు మురళీ, సుఖేంధర్, సురేష్, హరిప్రసాద్, స్వామిగౌడ్ రాస్తారోకో విరమించాలని రైతులను కోరారు. తహసీల్దార్ వచ్చేవరకు రాస్తారోకో విర మించమన్నారు. తహసీల్దార్ అర్చన రాస్తారోకో చోటికి చేరుకొనిరైతులతో మాట్లాడారు. అనం తరం వినతిపత్రం సమర్పించారు.
ప్రెస్‌మీట్‌లతో పసుపు బోర్డు రాదు
పసుపు బోర్డు ఏర్పాటు కాదని రైతులతో కలిసి ఉద్యమిస్తేనే పసుపు బోర్డు సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓయూ విద్యార్థి నేత రాజా రాంయాదవ్ అన్నారు. ఎంపీ కవిత ప్రయత్నాలు ప్రెస్‌మీట్‌లకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యేలు ప్రభుత్వ సొంత రాష్ట్ర ఏర్పడ్డాక ఎర్రజొన్నలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీ ఏమైందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత వి.ప్రభాకర్ ప్రశ్నించారు. 2008లో ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతుల దీక్షాకు హజరైన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాత ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారని ఇప్పుడు తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిసిసి ప్రధానకార్యదర్శి సుంకెట రవి, ఎఐకెఎంఎస్ నాయకులు సారా సురేష్, రైతులు పడిగెల ప్రవీణ్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గోపి, లింగారెడ్డి, మారుశంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News