Wednesday, April 24, 2024

రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ 27 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Raj Kundra police custody extended to july 27

 

ముంబయి: నీలి చిత్రాలను చిత్రీకరించి వాటిని కొన్ని యాప్‌ల ద్వారా విక్రయించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో అరెస్టయిన వ్యాపారి, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోలీసు కస్టడీని ఈనెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ స్థానిక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఐపిసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ముబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నెల 19న రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కుంద్రాను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఇదివరకు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గడువు శుక్రవారం ముగిసిపోవడంతో ఆయనను మరోసారి నేడు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి కుంద్రా కస్టడీని పొడిగించాలని పోలీసులు కోరడంతో ఈ నెల 27 వరకు పోలీసు కస్టడీని పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. కుంద్రాతోపాటు మరో నిందితుడు రియాన్ తోర్పేను కూడా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచగా ఆయన కస్టడీని కూడా మెజిస్ట్రేట్ ఈ నెల 27 వరకు పొడిగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News