Home వార్తలు రాజ్‌తరుణ్ కొత్త చిత్రం షురూ

రాజ్‌తరుణ్ కొత్త చిత్రం షురూ

Raj Tarun

 

యంగ్ హీరో రాజ్‌తరుణ్ కథానాయకుడిగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ “అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం వంటి హిట్ చిత్రాల తర్వాత మా శ్రీ సత్య ఆర్ట్ బ్యానర్‌లో చేస్తున్న మరో మంచి కథా చిత్రమిది. రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్‌లో ఇది మా బ్యానర్‌కు మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది”అని అన్నారు.

దర్శకుడు కొండా విజయ్‌కుమార్ మాట్లాడుతూ “మూడు సంవత్సరాల పాటు వర్క్ చేసి సిద్ధం చేసిన అద్భుతమైన కథను రాధామోహన్ విన్న వెంటనే సినిమాను ప్రారంభిద్దామని అన్నారు. రాజ్ తరుణ్‌కు ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది”అని తెలిపారు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్, మాటలు: నంద్యాల రవి, ఆర్ట్: రాజ్‌కుమార్, కో-డైరెక్టర్: వేణు కూరపాటి.

Raj Tarun and Konda Vijay Kumar film launched