Saturday, April 20, 2024

అప్పుడే తారక్ ఫస్ట్‌లుక్: రాజమౌళి

- Advertisement -
- Advertisement -

Rajamouli Clarity on Jr NTR look in RRR Movie

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో చరణ్ పాత్ర హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగిన ఆ వీడియో సినీ అభిమానులకి మంచి అనుభూతిని పంచింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆయన ఫస్ట్ లుక్, ఇంట్రో వీడియో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది.

ఇక అప్పటి నుంచి అభిమానులు తారక్ అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవలే కరోనా నుంచి బయటపడిన రాజమౌళి తాజాగా మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, ఇంట్రో వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు షూటింగ్‌కి వెళ్లకూడదని అనుకుంటున్నానని.. ఒకవేళ షూటింగ్ ప్రారంభమైతే పది రోజుల తర్వాత తారక్‌కి సంబంధించిన విజువల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ అప్‌డేట్ ఇస్తామని రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా… అని తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rajamouli Clarity on Jr NTR look in RRR Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News