Thursday, July 17, 2025

‘రాజాసాబ్’ టీజర్ లోడింగ్.. భయపడుతున్న హీరోయిన్స్

- Advertisement -
- Advertisement -

సలార్ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ‘రాజాసాబ్‘. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘రాజాసాబ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో జూన్ 16న టీజర్ ను వదులుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆదివారం ఈ మూవీ ప్రీ టీజర్ ను మేకర్స్ వదిలారు. ఇందులో.. చీకటిగా ఉన్న ఓ ప్యాలెస్ లోకి వచ్చిన ముగ్గురు హీరోయిన్లు భయంగా పైకి చూస్తున్నారు.. తర్వాత టీజర్ లోడింగ్ అవుతున్నట్లు చూయించారు. రేపటి నుంచి రెబల్ వైబ్ స్టార్ట్ అని మేకర్స్ పోస్ట్ చేశారు. రేపు ఉదయం 10.25 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తొలిసారి ప్రభాస్.. హారర్ కామెడీ చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ తోపాటు సనీ ప్రేక్షకులు ‘రాజాసాబ్’ పై ఆసక్తిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News