Saturday, June 21, 2025

‘ఆయన మాట తూలింది.. వదిలేయండి..’: అలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో డేవిడ్ వార్నర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా నటుడు అలీ (Ali) గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే దీనిపై అలీ తాజాగా స్పందించారు. తనపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కావని అలీ అన్నారు. ఆయన మాట తూలిందని.. ఇక ఆ విషయాన్ని వదిలేయాని ఆయన పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించిన వీడియోలను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.

‘‘రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్. ఆయన తన కూతురును కోల్పోయిన దుఃఖంలో ఉన్నారు’’ అని అలీ అన్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్పి కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) .. అలీ (Ali)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ కూడా స్పందించారు. తన కొత్త సినిమా ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని.. తానెప్పుడూ ఇతరులతో సరదాగా ఉంటానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News