- Advertisement -
జగ్గయ్యపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీఐ ఎపి కృష్ణా జిల్లాలో వివాదంలో చిక్కుకున్నాడు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన పుష్పన్ కుమార్ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి విజయతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని కారణాలతో గత మూడేళ్లుగా భార్య, భర్తలు దూరంగా ఉంటున్నారు. అయితే ఇద్దరు విడాకులు తీసుకొవాలని నిర్ణయించుకొని కొర్టును కూడా ఆశ్రయించారు. అప్పటి నుండి వీరు విడిగానే ఉంటున్నారు. ఈ కేసు కోర్టులో ఉండగానే పుష్పన్ కుమార్ మరో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య విజయ, కుటుంబ సభ్యులతో కలిసి సీఐ ఇంటి ముందు దర్నాకు దగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Advertisement -