Home తాజా వార్తలు హల్ చల్ చేస్తున్నకాలా టీజర్…

హల్ చల్ చేస్తున్నకాలా టీజర్…

Kaala-Rajini-images

అభిమానులు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నకాలా సిన్మా టీజ‌ర్ వచ్చేసింది. వండ‌ర్ బార్ ఫిలింస్ ప‌తాకంపై ధ‌నుష్ నిర్మాణంలో పా రంజిత్ డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమా త‌మిళ టీజ‌ర్ గురువారం రాత్రి విడుదల అయింది. తెలుగు, హిందీ భాష‌ల‌కి సంబంధించిన టీజ‌ర్ శుక్రవారం ఉదయం విడుద‌ల చేశారు. ”కాలా అంటే ఎవరు.. కాలుడు కరికాలుడు.. గొడవపడైనా సరే కాపాడేవాడు” అంటూ తలైవా గురించి ఇంట్రడక్షన్ ఉంది. ‘నలుపు… శ్రమజీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు.. మురికి కూడా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది”  కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు’, ‘క్యారే.. సెట్టింగా’ అనే డైలాగ్స్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. మాఫియా డాన్‌గా క‌రికాల‌న్ పాత్ర‌లో ర‌జనీకాంత్  దుమ్ములేపారు.  ఈ సినిమాను ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.  నానా ప‌టేక‌ర్ డైలాగ్‌తో మొద‌లైన టీజ‌ర్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది. ర‌జ‌నీకాంత్ 164వ సిన్మాగా వస్తున్నఈ సినిమాలో రజనీకి భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, తనయుడి పాత్రలో దిలీపన్ కనిపించనున్నారు. తమిళ   యాక్టర్స్ సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు నటిస్తున్నారు. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ సిన్మాలో ర‌జ‌నీకాంత్ మాఫియా డాన్ గా అద‌ర‌గొట్టాడ‌ని టీజ‌ర్‌ని చూస్తుంటే తెలుస్తుంది.