Home చిన్న సినిమాలు ఆకట్టుకుంటున్న ‘పెద్దన్న’ ట్రైలర్..

ఆకట్టుకుంటున్న ‘పెద్దన్న’ ట్రైలర్..

హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీని తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో నయనతార, రజినీకాంత్ కు జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. హై హోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రజినీకాంత్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. సీనియర్ హీరోయిన్లు మీనా, ఖుష్బూలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుగా రానుంది.

Rajinikanth’s ‘Peddanna’ Trailer Released