Home తాజా వార్తలు త్వరలో ‘రజనీ’ బయోపిక్.!

త్వరలో ‘రజనీ’ బయోపిక్.!

Rajnikanth-Specialహైదరాబాద్ : ఆరు పదుల వయసు దాటిన అంతులేని అభిమానులు ఆయన సొంతం. దక్షిణాదిలో, బాలీవుడ్‌లో మాత్రమే కాదు… ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్ కలిగిన నటుడు ఆయన.. ఆయన ఎవరో కాదు.. సూపర్‌స్టార్ రజనీకాంత్.
తాజాగా ‘కబాలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ముందుకొచ్చిన రజనీ.. తనదైన స్టైల్‌తో మరోసారి రికార్డులను తిరగరాశారు. ఎంత స్టార్‌డమ్ ఉన్న రజనీ మాత్రం ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలానే ఉంటారు.. అది ఆయన ప్రత్యేకత.. సమయం దొరికినప్పుడు హిమాలయాలకు వెళ్లడం.. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం.. సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవడంలో రజినీ ముందుంటారు. దీంతో సినిమాలోనే కాదు.. నిజజీవితంలోనే రజనీకాంత్ సూపర్‌స్టార్ అని అందరూ ప్రశంసిస్తుంటారు. మరి అలాంటి ఆయన జీవితం వెండితెరపై చూస్తే అభిమానులకు అంతకంటే పండుగ ఇంకేముంటుంది. ఇప్పుడు అదే పనిలో ఉందట ఆయన కుమార్తె ఐశ్వర్య. ఐశ్వర్య రజనీకాంత్ బయెపిక్‌ను సినిమాగా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బయోపిక్‌ల సీజన్ నడుస్తుడటంతో రజనీ కథను కూడా ప్రేక్షకులకు అందించాలనుకుంటోందట. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ‘రజనీ’ బయోపిక్ వస్తే అది మరింత సంచలనానికి దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.