Home తాజా వార్తలు ‘రాజుగారి గది 3’: ఈ కన్యను తాకాలని చూస్తే మరణం తప్పదు

‘రాజుగారి గది 3’: ఈ కన్యను తాకాలని చూస్తే మరణం తప్పదు

 

హైదరాబాద్: తొలి ప్రయత్నంలో ‘రాజుగారి గది’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు ద‌ర్శ‌కుడడు ఓంకార్. ఆ తర్వాతా అక్కినేని నాగార్జున, సమంత తదితరులు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘రాజుగారి గది 2’ చిత్రం మంచి అంచనాలతో విడుదలై ప్రేక్షకులను అలరించలేకపోయింది. మరోసారి ఓంకార్ ‘రాజుగారి గది 3’ చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. అయితే ఈ చిత్రాన్ని మొదట తమన్నాతో తెరకెక్కించాలని భావించినా పలు కారణాలతో ఈ బ్యూటీ మూవీ నుంచి తప్పుకుంది. దీంతో అవికా గోర్, అశ్విన్‌బాబు ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

కాగా, ఇటీవ‌ల రాజుగారి గ‌ది 3 చిత్రీకరణ కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీకి షబీర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ‘ఈ కన్యను తాకాలని చూస్తే మరణం తప్పదు..’ అంటూ అశ్విన్ బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండ‌గా, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

 

‘Raju Gari gadhi 3’ Movie trailer released