Friday, March 29, 2024

ఎఫ్‌సిఆర్ఎ బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ:  ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడారు. అంతర్జాతీయ భద్రతకు విదేశీ నిధుల నియంత్ర సవరణ బిల్లు పని చేస్తోందన్నారు. విదేశీ నిధులు దుర్వినియోగం చెందకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భారత్ రాజకీయ స్థితిగతులపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని వివరించారు. విదేశీ నిధులు తీసుకునే కొన్ని సంస్థలు దుర్వినియోగం చేసినట్టు గుర్తించామన్నారు. అందుకు ఆధార్ కార్డు తీసుకొచ్చామన్నారు. 2010లో ఎఫ్‌సిఆర్‌ఎ చట్టాన్ని కేంద్ర హోంమంత్రి చిదంబరం తీసుకొచ్చారని, అప్పటి నుంచి 20 వేల కోట్లు విదేశీ నిధులు రూపంలో భారత్‌కు వచ్చాయని, పది వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో వివరాలు లేవన్నారు. మంచి ఉద్దేశ్యంతో పని చేస్తున్న ఎన్‌జిఒలకు ఈ బిల్లుతో ఎటువంటి ఇబ్బంది లేదని ఎంపి బాలసుబ్రమణియన్ తెలిపాడు. ఎన్‌జిఒ సంస్థలు నడిపేవారు ఎకౌంట్ ఓపెన్ చేయడానికి ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని స్థానికంగా ఉండే ఎస్‌బిఐ బ్రాంచ్‌లో ఓపెన్ చేసుకోవచ్చన్నారు. లోక్‌సభలో ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లును సెప్టెంబర్ 21న పాస్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News