Home దునియా ఎకో ఫ్రెండ్లీగా ‘రక్షాబంధన్‌’

ఎకో ఫ్రెండ్లీగా ‘రక్షాబంధన్‌’

raksha-bandhanపండుగ ఏదైనా పర్యావరణానికి హానికాకూడదు. నేటి తరం ఈ అంశాన్ని చక్కగా గమనిస్తున్నారు. అందుకనే ఈ రక్షాబంధన్‌ను ఎకోఫ్రెండ్లీగా జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అక్కాచెల్లెళ్ల రక్షణతో పాటు ప్రకృతిని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని గమనించడం మంచి విషయం. కొన్ని పర్యావరణహిత సంస్థలు ఎకో ఫ్రెండ్లీగా రాఖీని ఎలా జరుపుకోవాలో వివరిస్తున్నాయి.

రాఖీలే మొక్కలు
మీరు మనసు పెడితే మొక్కలకే రాఖీలను పూయించవచ్చు అంటున్నారు గార్గి. ‘బా నో బాట్వో’ వ్యవస్థాపకులు గార్గి ఔరంగాబాద్ నివాసి. చెట్లు, మొక్కల నుంచి ఆకులు, గింజలు, షెల్ ..వంటి భాగాలను సేకరించి వాటిని రాఖీల తయారీ కోసం వాడుతున్నారు. ఆన్‌లైన్ ప్రచారం ద్వారా ‘నా సోదరి నా బలం’ అనే ట్యాగ్‌తో క్యాంపెయిన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

సీడ్ పేపర్ రాఖీ
బెంగుళూరులోని జీసస్ హెచ్‌ఐవీ హోమ్‌లో ఏడాది నుంచి పదేళ్ల వయసున్న హెచ్‌ఐవీ ప్రభావిత పిల్లలు తలదాచుకుంటున్నారు. వీరికి ‘సీడ్ పేపర్ ఇండియా’ వ్యవస్థాపకులు రోషన్ రాయ్ పర్యావరణ హితమైన రాఖీలను రెండేళ్లుగా అందిస్తున్నారు. ఈ రాఖీలు ఎలా ఉంటాయంటే .. మొక్క వచ్చేందుకు అనువైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు, కొబ్బరినారతో తయారు చేసిన కార్డులను.. ఇలాంటి వాటితో ఒక కిట్‌ని రూపొందించి వారికి ఇస్తున్నారు.

సీడ్ రాఖీలు
ప్రజలతో కలిసి పనిచేస్తేనే అనుభవాలు పువ్వుల పరిమళాలవుతాయి. ఢిల్లీ వాసి సౌరభ్ డిగ్రీ తర్వాత సొంతంగా బాల్ పెన్ తయారీ వ్యాపారం పెట్టుకున్నాడు. ఏడాది గడిచాక పెన్నులన్నీ ప్లాస్టిక్‌వే అని ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. ‘బయో క్యూ’ పేరుతో ‘పర్యావరణహితమైన స్టేషనరీ’ని ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ ద్వారా ప్రతి నెలా 5-6 లక్షల విత్తనాల పెన్నులు, పెన్సిళ్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన నుంచే మొక్కల రాఖీలను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు సౌరభ్. ‘కిందటేడాది 6,000ల సీడ్ రాఖీలు తయారుచేశాం. ఈ ఏడాది 15,000 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఢిల్లీలోని చుట్టుపక్కల స్లమ్ ఏరియాల నుంచి 20 మంది మహిళలతో ఈ గ్రీన్ రాఖీల తయారీ చేస్తున్నాం. దీనిద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం’ అని ఆనందంగా చెబుతున్నాడు సౌరభ్.

ఒక్కో దారానికి ఒక్కో కథ
ముంబయ్‌లో ఆదివాసీల హక్కుల కోసం ర్యాలీ చేసిన మానవ హక్కుల కార్యకర్త నవ్లీన్ 19 కత్తి పోట్లకు గురయ్యారు. ఆమె జ్ఞాపకార్థం ‘గ్రామ్ ఆర్ట్’ 19 ముడులతో కూడిన రాఖీని తయారుచేసింది. గర్భాశయ ఆకారంలో ఉన్న రాఖీ ద్వారా సమాజంలో లింగ అంతరాన్ని ఎత్తి చూపుతుంది. ఇలా ఒక్కో దారం ఒక్కో కథను కళ్లకు కట్టేలా చేస్తుంది గ్రామ్ ఆర్ట్. ‘హమ్ కమ్జోర్ నహీ’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కి చెందిన 100 మంది గ్రామీణ మహిళలతో కలిసి ఈ విత్తన రాఖీల తయారీని చేపట్టారు. ఈ ఏడాది 20,000ల సీడ్ రాఖీలను అమ్మనుంది.

గోబర్ రాఖీలు
అల్ఖా లహోటి అనే 52 ఏళ్ల ఎన్నారై ఆలోచన నుంచి మొదలైందిది. గోశాలలో పనిచేస్తూనే ఆవు పేడ నుంచి వివిధ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. “ ఈ ఏడాది కుంభమేళాకు వెళ్లాను. అక్కడ ఈ ఆవుపేడ రాఖీలను ప్రదర్శించాం. అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరిన్ని తయారుచేస్తున్నామంటోంది.

పేపర్ బంధన్

పేపర్‌తో తయారు చేసిన రాఖీతో పాటు కిట్‌లో అరుదైన జాతి మొక్కల విత్తనాలు చుట్టి ఉన్న కాగితం పాకెట్ కూడా ఉంటుంది. ఈ విత్తనాల ద్వారా మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పిస్తోంది బైస్మిటా వ్యవస్థాపకులు స్మిత.

 అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు.

బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి జరపడం కనిపిస్తుంది.

Raksha Bandhan Celebration With Eco friendly