Home తాజా వార్తలు మహిళా సంక్షేమం, గౌరవ మర్యాదలకు కట్టుబడి ఉన్నాం

మహిళా సంక్షేమం, గౌరవ మర్యాదలకు కట్టుబడి ఉన్నాం

Raksha Bandhan Celebrations At Pragathi Bhavan

 

మహిళాసంక్షేమం, అభివృద్ధి, గౌరవ మర్యాదలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రేమానుబంధాలకు రాఖీ ప్రతీక : సిఎం కెసిఆర్
కెసిఆర్‌కు రాఖీలు కట్టి దీవించిన సోదరీమణులు

మనతెలంగాణ/హైదరాబాద్: సోదరప్రేమకు రక్షాబంధన్ ప్రతీకని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. రక్షాబంధన్ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌కు ఆ యన సోదరీమణులు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. సంప్రదాయ సిద్ధంగా సోదరు డు కెసిఆర్‌కు సోదరీమణులు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో సిఎం కెసిఆర్ సతీమణి శోభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు సందే శం ఇచ్చారు. సోదరప్రేమానుబంధాలకు రాఖీ ప్రతీకని చెప్పారు. మహిళాభద్రత, సంక్షేమం, మహిళల గౌరవ మర్యాదలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అ నంతరం రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కెటిఆర్‌కుమారుడు హిమాన్ష్‌కు సోదరి అలేఖ్య తల్లి శైలిమ సమక్షంలో రాఖీ కట్టింది. ఆతర్వాత అన్న చెల్లెలు ఒకరి నొకరు స్వీట్స్ తినిపించుకున్నారు.

కెటిఆర్, సంతోష్‌కు రాఖీ కట్టిన కవిత
మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత అన్న కెటిఆర్‌కు రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఆతర్వాత ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు కవిత రాఖీ కట్టారు. అలాగే ఎంపి సంతోష్‌కుమార్ చెల్లి సౌమ్యరావు అన్న సంతోష్‌కుమార్‌కు, కెటిఆర్‌కు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపి గుండూసుధారాణి కెటిఆర్, సంతోష్‌కుమార్‌కు రాఖీ కట్టిమిఠాయిలు తినిపించారు. అలాగే కొండాపూర్‌లో మంత్రి హరీష్‌రావుకు పలువురు టిఆర్‌ఎస్ మహిళానాయకులు రాఖీలు కట్టి దీవించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనుబంధానికి ఆప్యాయతలకు రాఖీ పండుగ ప్రతీకని చెప్పారు, కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్షాబంధన్‌తో పాటు స్వీయ రక్షణ పాటించాలని చెప్పారు.

అలాగే పలువురు మహిళానాయకులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభస్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాఖీలు కట్టారు. అప్యాయతలు, అనురాగాలతో అన్నా చెల్లెలు,అక్కాతమ్ముళ్లు ఆనందంగా జరపుకునే పర్వదినం రాఖీ పండుగని వారు చెప్పారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుత్తా, పోచారం శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు టిఆర్‌ఎస్ మహిళావిభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి రాఖీ కట్టారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు వెస్ట్‌మారెడుపల్లిలోని మంత్రి నివాసంలో ఆయన చెల్లెలు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రజలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆయన సోదరీమణులు లక్ష్మీ, విమల రాఖీలు కట్టారు. ప్రతి ఇంట్లోను పండుగవేడుకలు ఆనందంగా జరపుకోవాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో స్వీయరక్షణను మర్చి పోవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. మంత్రి అజయ్ కి ఖమ్మంలో మహిళా కార్పొరేటర్లు రాఖీలు కట్టి దీవించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యవసాయశాఖలోని మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో తమ్ముడు నర్సింహారెడ్డికి రాఖీ కట్టి దీవించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్లు రాఖీ పండుగ పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరపుకున్నారు. కరో నా నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే పండుగ నిర్వహించారు. గతం మాదిరిగా రక్షాబంధన్ సమ్మేళనాలు, సమావేశాలు ఎక్కడా జరగలేదు. నిరాడంబరంగా సంప్రదాయాలతో సోదరప్రేమకు ప్రతీకగా రక్షాబంధన్ ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు.

Raksha Bandhan Celebrations At Pragathi Bhavan