Home జాతీయ వార్తలు కరోనా పోరాటంలో నర్సుల సేవలు గొప్పవి : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

కరోనా పోరాటంలో నర్సుల సేవలు గొప్పవి : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Raksha Bandhan Celebrations At Rashtrapati Bhavanఢిల్లీ : కరోనా పోరాటంలో నర్సులు చేస్తున్న సేవలు గొప్పవని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. సోమవారం రాష్ట్రపతి భవన్ లో  రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నర్సులు రాష్ట్రపతికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.  కరోనాతో పోరాటంలో అంకితభావంతో పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు ప్రజలు విధిగా సహకరించాలని రాష్ట్రపతి ప్రజలను కోరారు. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన కరోనా  నిబంధనలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి సతీమణి కూడా పాల్గొన్నారు. రాఖీ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో కరోనా నిబంధనలు పాటించారు.