Thursday, April 25, 2024

ఈ రోజే భూమ్మీదకు ఎందుకు వచ్చావో అర్థమైంది: చిరు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు చెర్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున చెర్రీ జన్మించాడని మెగస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. రామ్‌చరణ్ ఈ రోజు భూమ్మీదకు రావడానికి కారణం అర్థమైందని, నీళ్లలో చేపలాగా నటనను చెర్రీ ఇమిడించుకున్నాడని చిరు పొగిడారు. హ్యపీ బర్త్ డే చరణ్ అంటూ చిన్న నాటి ఫోటోతో చిరంజీవి ట్వీట్ చేశాడు.

తన బావ రామ్‌చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఈ రోజు నిన్ను కలవాలని ఉంది కాని… కరోనా వైరస్ నిర్మూలన కోసం ఇళ్లకే పరిమితమయ్యామని తెలిపారు. కొత్త సంవత్సరం నీ జీవితంలో ఎన్నో విజయాలు, ఆనంద క్షణాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

హ్యాపీ బర్త్ డే మిత్రమా అంటూ మంచుమనోజ్ చరణ్ కు ట్వీట్ చేశాడు. వందేళ్ల పాటు ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, లవ్ యు బాబాయ్, వెల్‌కమ్ టు ట్విట్టర్ అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

హ్యాపీ బర్త్ డ్ చరణ్ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. మంచి ఆరోగ్యంతో పాటు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని, మనందరం చిన్ననాటి జ్ఞాపకాల గుర్తుగా తీసిన ఫోటోను ట్వీట్టర్‌లో పోస్టు చేశాడు.

Ram Charan Born in Prapancha Rangasthala dinotsavam
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News