Home Default కియారా బర్త్‌డే పార్టీలో చరణ్…‘RRR’ లుక్ వైరల్

కియారా బర్త్‌డే పార్టీలో చరణ్…‘RRR’ లుక్ వైరల్

 

హైదరాబాద్: ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ లుక్ వైరల్‌గా మారింది. గురవారం రాత్రి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పుట్టినరోజు వేడుకలో చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ బ్లాక్ దుస్తువులు ధరించి సందడి చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఫోటోల్లో కోరమీసంతో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం చరణ్, రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇప్పుడు రామరాజు లుక్‌లో చరణ్‌ను చూసి మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

Ram Charan new look viral