Home సినిమా అజర్‌బైజాన్‌లో కీలక సన్నివేశాలు

అజర్‌బైజాన్‌లో కీలక సన్నివేశాలు

Ram Charan New Movie Titled Azar Bayzan

రామ్‌చరణ్ హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ అజర్ బైజాన్‌లో మంగళవారం ప్రారంభమైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ “రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలను మించేలా తెరకెక్కిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను పూర్తిచేశాం. మంగళవారం నుండి అజర్‌బైజాన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. 25 రోజుల పాటు జరుగబోయే షెడ్యూల్‌లో రామ్‌చరణ్ సహా మొత్తం సినిమా యూనిట్ పాల్గొంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తాం”అని అన్నారు. రామ్‌చరణ్, కియారా అద్వానీ, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌ః రిషి పంజాబీ, సంగీతంః దేవీశ్రీ ప్రసాద్, ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలుః ఎం.రత్నం.