Thursday, April 25, 2024

ఆచార్య ‘సిద్ధ’మవుతున్నాడు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరు 152వ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో చిరుకు జోడీగా మరోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. తాజాగా ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించిన ఫోటోను కొరటాల శివ ట్వీట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఆచార్య ‘సిద్ధ’ మవుతున్నాడు’ అని కామెంట్ కూడా పెట్టాడు. చరణ్ భుజంపై వెనుక నుంచి చిరంజీవి చేయి వేసి నిల్చున్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. కొరటాల ట్వీట్ తో త్వరలోనే చిత్రయూనిట్ ‘ఆచార్య’ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ మూవీ మే 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

https://twitter.com/sivakoratala/status/1366331673722294273?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1366331673722294273%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fsivakoratala2Fstatus2F1366331673722294273widget%3DTweet

Ram Charan shares his poster from Acharya movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News