Friday, April 19, 2024

సిద్ధపై కీలక సన్నివేశాలు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంట్‌ట్రైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన యూనిట్.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ మాట్లాడుతూ..“ఇటీవల ‘ఆచార్య’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాము. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాము. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాము. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, లాహే లాహే సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది”అని అన్నారు.

Ram Charan Shoot Resume of Acharya Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News