Home తాజా వార్తలు శ్రీరాములు థియోటర్ కు మాస్ గెటప్ లో వర్మ

శ్రీరాములు థియోటర్ కు మాస్ గెటప్ లో వర్మ

 

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇస్మార్ట్ శంకర్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తన శిష్యడు పూరీ జగన్నాథ్ తీసిన సినిమా కావడంతో ఆ మూవీపై వరసగా ట్వీట్లు చేస్తున్నారు. హేయ్ పూరీ.. తాను, అజయ్ భూపతి, అగస్త కలిసి సినిమా థియోటర్‌లో డ్యాన్స్‌తో అదరగొడుతామని చెప్పారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మూసాపేటలోని శ్రీరాములు థియోటర్‌లో మూవీని వీక్షిస్తానని ట్వీట్ చేశాడు. పూరీ నంబర్ వన్ దర్శకుడని పొగిడారు, ఇస్మార్ట్ శంకర్ మూవీ భాగా కలెక్షన్లు రావడంతో పూరీ తన చిత్రయూనిట్‌కు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా పూరీని ఆర్‌జివి ముద్దుపెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ సినిమా 25 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని సినిమా బృందం వెల్లడించింది.

 

Ram Gopal Varma Promotion to Ismart Shanker Movie