Friday, March 29, 2024

అయోధ్య రామాలయం మొదటి దశ పనులు పూర్తి

- Advertisement -
- Advertisement -

Ram Mandir construction work First phase completed

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామమందిరం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్‌పై రాళ్లతో మరో పొరను ఏర్పాటు చేయనున్నట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గురువారం తెలిపారు. ఈ రాతిపొర నిర్మాణంలో కర్నాటక గ్రానైట్, మీర్జాపూర్ ఇసుక రాయిని ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. కాగా అయోధ్యలోని పదెకరాలకు పైగా స్థలంలో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్న మూడంతస్థుల భవ్య రామాలయాన్ని 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రారంభించాలని లక్షంగా పెట్టుకున్నారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజతో ఆలయ నిర్మాణ పనులు ప్రాంభమైనాయి. ఆలయం పునాదుల కోసం 40 అడుగుల లోతు తవ్విన అనంతరం ఒక్కో పొర అడుగు మేర ఎత్తులో 47 పొరలతో కాంక్రీట్ బేస్‌ను నిర్మించారు. 360×235 అడుగుల నిర్మాణగ్రౌండ్ ఫ్లోర్‌లో160 స్తంభాలు, మొదటి అంతస్థులో 132 స్తంభాలు, రెండో అంతస్థులో 72 స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐదు మండపాలు కూడా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News