Home జాతీయ వార్తలు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న కోవింద్

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న కోవింద్

Ram Nath returns to Rashtrapati Bhavan after bypass surgery

 

గుండె ఆపరేషన్ అనంతరం కోలుకున్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్(75) సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అనారోగ్యంతో మార్చి 27న ఢిల్లీలోని ఆర్మీ(ఆర్‌ఆర్) హాస్పిటల్‌లో చేరిన కోవింద్ రెండు వారాల తర్వాత రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. కోవింద్‌కు మార్చి 30న ఎయిమ్స్‌లో గుండె ఆపరేషన్ జరిగింది. ఆయన ఇప్పుడు కోలుకొని రాష్ట్రపతి భవన్‌కు చేరారు. రెండు ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తనను ఎంతో శ్రద్ధగా చూశారని రాష్ట్రపతి ట్విట్ చేశారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తానిపుడు ఎంతో సంతోషంగా ఉన్నానన్నారు. మొదట ఆర్మీ హాస్పిటల్‌లో చేరిన రాష్ట్రపతికి సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. దాంతో, ఆయణ్ని ఎయిమ్స్‌కు తరలించి సర్జరీ నిర్వహించారు.

Ram nath returns to rashtrapati bhavan after bypass surgery