Home తాజా వార్తలు తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా పి.రామకృష్ణ గౌడ్

తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా పి.రామకృష్ణ గౌడ్

Telangana Film Chamber

 

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలలో ఛాంబర్ అధ్యక్షుడిగా పి.రామకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛాంబర్ ప్రధాన సలహాదారుడిగా ప్రముఖ నిర్మాత ఏ.యం.రత్నం, ఉపాధ్యక్షులుగా గురురాజ్, రంగా రవీంద్ర గుప్తా, అలీ భాయ్, కార్యదర్శులుగా కె.వి.రమణా రెడ్డి, కె .సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి.మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా సతీష్, నాగరాజు గౌడ్ , జి.శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఎన్నికయ్యారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వి.కృష్ణా రావు, హెచ్.కృష్ణారెడ్డి, అలెక్స్, ఇ.సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి.రాజేష్, ఎం.వెంకటేష్, ముఖావర్ వలి, మహాలక్ష్మి , బి. నాగరాజులను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి .రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “ తెలంగాణ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయింపు, పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల కోసం స్థలం కేటాయింపు , కల్చరల్ సెంటర్ కోసం స్థలం కేటాయింపుతో పాటు 24 క్రాఫ్ట్‌లో వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కలిసి ఇవన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలనీ కోరుతాం”అని అన్నారు.

Ramakrishna Goud President of Telangana Film Chamber